samanta: సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం

  • త్రిషపై ప్రశంసలు కురిపించిన సమంత
  • 'సైరా' పూర్తి చేసి వస్తున్న చిరంజీవి
  • నిఖిల్ సరసన నివేదా థామస్

*  ప్రముఖ కథానాయిక త్రిషను మరో కథానాయిక సమంత ప్రశంసలతో ముంచెత్తింది. దీనికి కారణం '96' చిత్రం. త్రిష నటించిన ఈ చిత్రం ఇటీవలే విడుదలైంది. ఇందులో త్రిష అభినయం అద్భుతమంటూ సమంత ట్వీట్ చేసింది. 'కష్టతరమైన పాత్ర అది.. అలాంటి పాత్రలో అద్భుతమైన అభినయాన్ని ప్రదర్శించావు. నీ అభినయం ఇలాగే కొనసాగాలి..' అంటూ త్రిషపై సమంత ప్రశంసలు కురిపించింది.
*  చిరంజీవి నటిస్తున్న 'సైరా' చిత్రం షూటింగ్ గత కొంత కాలంగా జార్జియాలో జరుగుతోంది. భారీ యాక్షన్ దృశ్యాల చిత్రీకరణలో పాల్గొన్న చిరంజీవి తన షూటింగును పూర్తిచేసుకుని తిరుగుపయనమయ్యారు. మిగతా ఆర్టిస్టులతో ఈ నెల 20 వరకు అక్కడ షూటింగ్ కొనసాగుతుంది.
*  ప్రస్తుతం 'ముద్ర' చిత్రంలో నటిస్తున్న యంగ్ హీరో నిఖిల్, తాజాగా మరో చిత్రానికి సంతకం చేశాడు. నూతన దర్శకుడు కిషన్ దర్శకత్వంలో రూపొందే ఈ చిత్రంలో నిఖిల్ సరసన నివేదా థామస్ హీరోయిన్ గా నటిస్తుంది.

More Telugu News