Srikakulam District: తిత్లీ తుపాను ఎఫెక్ట్.. శ్రీకాకుళంలో కూలిన సముద్ర వంతెన

  • గత కొన్నేళ్లుగా శిథిలావస్థలోనే వంతెన
  • తుపాను గాలులకు కుప్పకూలిన వైనం
  • శ్రీకాకుళంలోనే ముఖ్యమంత్రి, మంత్రులు

శ్రీకాకుళం జిల్లాను వణికించిన తిత్లీ తుపాను పెను విధ్వంసం సృష్టించింది. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం మొత్తం జిల్లాలోనే ఉండి సహాయక కార్యక్రమాలు పర్యవేక్షిస్తోంది. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, మంత్రి లోకేశ్ సహా మంత్రులు, అధికారులు జిల్లాలోనే ఉండి సహాయక చర్యలను దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. బాధితుల వెంటే ఉంటూ వారిలో ధైర్యాన్ని నింపుతున్నారు.

కాగా, జిల్లాలో తుపాను ప్రభావం పలు చోట్ల ఇంకా కనిపిస్తూనే ఉంది. తుపాను సందర్భంగా వీచిన బలమైన గాలుల ప్రభావం ఇప్పుడు చూపిస్తోంది. జిల్లాలోని తీర ప్రాంతాల్లో ఒకటైన మొగదలపాడులో ఉన్న సముద్ర వంతెన గాలుల ధాటికి కుప్పకూలింది. గత కొన్నేళ్లుగా ఇది శిథిలావస్థలోనే ఉన్నప్పటికీ తాజాగా వీచిన తుపాను గాలులకు బుధవారం కుప్పకూలింది.

More Telugu News