saidharam tej: లవ్ స్టోరీతో రంగంలోకి దిగుతోన్న మెగా హీరో

  • మరో ప్రేమకథకు సన్నాహాలు 
  • తేజు సరసన కల్యాణి ప్రియదర్శన్
  • వచ్చేనెల 2 నుంచి రెగ్యులర్ షూటింగ్    

వరుస పరాజయాలతో ఉక్కిరి బిక్కిరి అవుతోన్న సాయిధరమ్ తేజ్, తన తదుపరి సినిమా 'చిత్రలహరి' కోసం రెడీ అవుతున్నాడు. ఈ సినిమాలో ఆయన కొత్త గెటప్ తో కనిపించనున్నాడు. ఈ లుక్ కోసమే ఆయన కొంత గ్యాప్ కూడా తీసుకున్నాడు. కిషోర్ తిరుమల దర్శకత్వం వహించనున్న ఈ సినిమా, ఇటీవలే పూజా కార్యక్రమాలను జరుపుకుంది.

ఈ సినిమాలో కథానాయికగా కల్యాణి ప్రియదర్శన్ ను ఎంపిక చేసుకున్నారు. నవంబర్ 2వ తేదీ నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలుకానుందనేది తాజా సమాచారం. రొమాంటిక్ లవ్ స్టోరీస్ ను తెరపై ఆవిష్కరించడంలో కిషోర్ తిరుమల సిద్ధహస్తుడు. అదే కథాంశంతో ఈ సినిమా రూపొందుతుండటం అందరిలో ఆసక్తిని రేకెత్తిస్తోంది. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం యూత్ ను ఒక ఊపు ఊపేస్తుందని అంటున్నారు. ఈ సినిమాలోను కమెడియన్ గా సునీల్ చేస్తుండటం విశేషం.  

More Telugu News