నన్ను హతమార్చేందుకు ‘రా’ కుట్ర పన్నింది!: శ్రీలంక అధ్యక్షుడు

17-10-2018 Wed 16:43
  • కేబినెట్ సమావేశంలో సిరిసేన అన్నారట
  • ఆశ్చర్యపోయిన కేబినెట్ మంత్రులు
  • ఈ కుట్ర గురించి ప్రధాని మోదీకి తెలియదన్న సిరిసేన
శ్రీలంక అధ్యక్షుడు మైత్రిపాల సిరిసేన మరికొన్ని రోజుల్లో భారత్ కు రానున్న తరుణంలో సంచలన ఆరోపణలు చేశారు. భారత్ కు చెందిన ఇంటెలిజెన్స్ సంస్థ 'రీసెర్చ్ అండ్ ఎనాలసిస్ వింగ్' (రా) తనను హతమార్చేందుకు కుట్ర పన్నుతోందని ఆరోపించినట్టు సమాచారం. ఈ కుట్ర గురించి భారత ప్రధాని మోదీకి తెలియకపోవచ్చని తమ కేబినెట్ సమావేశంలో సిరిసేన అన్నట్టు తెలుస్తోంది. సిరిసేన చేసిన ఈ వ్యాఖ్యలతో కేబినెట్ సహచరులు ఆశ్చర్యపోయారని సమాచారం. భారత్ పర్యటనకు రానున్న తరుణంలో సిరిసేన చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి.