punjab: జమ్ముకశ్మీర్ విద్యార్థులకు కొత్త నిబంధన విధించిన పంజాబ్!

  • నో క్రిమినల్ రికార్డ్ సర్టిఫికెట్ సమర్పించాలి
  • సర్టిఫికెట్ ను పంజాబ్ పోలీస్ అధికారులు పరిశీలిస్తారు
  • ఆ తర్వాతే అడ్మిషన్ పొందేందుకు అవకాశం

తమ రాష్ట్రంలోని విద్యాలయాల్లో చదువుకునే జమ్ముకశ్మీర్ విద్యార్థులకు సరికొత్త నిబంధనలను ఆ రాష్ట్ర ప్రభుత్వం విధించినట్టు సమాచారం. జమ్ముకశ్మీర్ నుంచి వచ్చే విద్యార్థులు తప్పనిసరిగా క్రిమినల్ రికార్డు లేదనే పత్రాలను (నో క్రిమినల్ రికార్డ్) సమర్పించాలని రాష్ట్ర పోలీస్ శాఖ అన్ని విద్యాసంస్థలకు ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో పంజాబ్ లో చదువుకోవాలనుకునే జమ్ముకశ్మీర్ విద్యార్థులంతా 'ఎలాంటి సంఘ విద్రోహ కార్యకలాపాలతో మాకు సంబంధం లేదు' అనే సర్టిఫికెట్ ను పోలీసు అధికారుల నుంచి తీసుకురావాల్సి ఉంటుంది. ఈ సర్టిఫికెట్ ను పంజాబ్ పోలీసు అధికారులు పరిశీలిస్తారు. ఆ తర్వాతే అడ్మిషన్ పొందేందుకు అనుమతిస్తారు.

జలంధర్ లో చదువుకుంటున్న కొందరు విద్యార్థులకు సంఘ విద్రోహ శక్తులతో సంబంధాలు ఉన్నాయనే అనుమానాలు ఇటీవల తలెత్తాయి. ఈ నేపథ్యంలోనే పంజాబ్ ప్రభుత్వం ఈ మేరకు నిర్ణయించింది. ప్రస్తుతం 9 వేల మంది జమ్ముకశ్మీర్ విద్యార్థులు పంజాబ్ లో చదువుకుంటున్నారు.

More Telugu News