Hyderabad: హైదరాబాదులో భారీ వర్షం.. అలర్ట్ అయిన జీహెచ్ఎంసీ అధికారులు

  • నిన్న సాయంత్రం నుంచి హైదరాబాదులో వర్షాలు
  • నీట మునిగిన లోతట్టు ప్రాంతాలు
  • అధికారులంతా అందుబాటులో ఉండాలంటూ జీహెచ్ఎంసీ కమిషనర్ ఆదేశం

కుండపోత వర్షం హైదరాబాద్ ను ముంచెత్తింది. నిన్న సాయంత్రం నగరంలో పలుచోట్ల భారీ వర్షం కురిసింది. నగరంలోని పలు లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. ఈ ఉదయం నుంచి కూడా భారీ వర్షం కురుస్తోంది. ఈ నేపథ్యంలో జీహెచ్ఎంసీ అధికారులు అప్రమత్తమయ్యారు. డిజాస్టర్ ఎన్ ఫోర్స్ మెంట్ బృందాలు రంగంలోకి దిగాయి.

 పాత భవనాలను ఖాళీ చేయాలని, లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని అధికారులు సూచించారు. ప్రజలకు అధికారులంతా అందుబాటులో ఉండాలని జీహెచ్ఎంసీ కమిషనర్ దాన కిశోర్ ఆదేశాలు జారీ చేశారు. మరోవైపు, కుండపోత వర్షంతో నగర ప్రజలు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు.

More Telugu News