metoo: లైంగిక ఆరోపణలు.. రాజీనామా చేసిన కాంగ్రెస్ జాతీయ నేత

  • కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగం జాతీయ అధ్యక్షుడు ఫిరోజ్ ఖాన్ పై ఆరోపణలు
  • లైంగికంగా వేధించారన్న పార్టీ మహిళా కార్యకర్త
  • ఫిరోజ్ రాజీనామాను ఆమోదించిన రాహుల్ గాంధీ

తాము ఎదుర్కొన్న లైంగిక వేధింపులు, అత్యాచారాలను మీటూ ఉద్యమం ద్వారా మహిళలు నిర్భయంగా బయటకు వెల్లడిస్తున్నారు. ఈ నేపథ్యంలో పలు రంగాల్లో ఉన్నత స్థాయిలో ఉన్న పలువురి చీకటి బతుకులు వెలుగులోకి వస్తున్నాయి. ఇప్పటికే ఎంతోమంది మీటూ దెబ్బకు అల్లాడిపోతున్నారు. తాజాగా ఈ వివాదంలో చిక్కుకున్న కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగం జాతీయ అధ్యక్షుడు ఫిరోజ్ ఖాన్ తన పదవికి రాజీనామా చేశారు. ఆయన రాజీనామాను పార్టీ అధినేత రాహుల్ గాంధీ ఆమోదించారు. రాజీనామా అంశాన్ని కాంగ్రెస్ పార్టీ అధికారికంగా ప్రకటించింది.

ఫిరోజ్ ఖాన్ వివాదం విషయానికి వస్తే... తనను ఆయన లైంగికంగా వేధించారంటూ ఛత్తీస్ గఢ్ కు చెందిన ఓ కాంగ్రెస్ మహిళా కార్యకర్త ఆరోపించారు. వాస్తవాలను నిర్ధారించడం కోసం ముగ్గురు సభ్యులతో కాంగ్రెస్ ఒక కమిటీని కూడా వేసింది. మరోవైపు, ఫిరోజ్ పై పార్లమెంట్ స్ట్రీట్ పోలీస్ స్టేషన్ లో బాధితురాలు ఫిర్యాదు కూడా చేసింది. తన ప్రాణాలకు ప్రమాదం ఉందని ఫిర్యాదులో పేర్కొంది. 

More Telugu News