allahabad: అలహాబాద్ పేరు మారింది.. ప్రతిపక్షాల ఆందోళనలు పట్టించుకోని సీఎం యోగి

  • ప్రయాగ్ రాజ్ గా మారిన అలహాబాద్
  • ఆమోదముద్ర వేసిన ఉత్తరప్రదేశ్ కేబినెట్
  • రుగ్వేదం, మహాభారతం, రామాయణాల్లో ఉన్న ప్రయాగ్ రాజ్

ఉత్తరప్రదేశ్ లోని అలహాబాద్ పేరు 'ప్రయాగ్ రాజ్'గా మారింది. ఈ రోజు నుంచి ఈ పేరు అమల్లోకి వస్తుందని యూపీ మంత్రి సిద్ధార్థ్ నాథ్ సింగ్ తెలిపారు. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశం అనంతరం ఆయన మాట్లాడుతూ, అలహాబాద్ పేరును ప్రయాగ్ రాజ్ గా మార్చాలనే నిర్ణయానికి కేబినెట్ ఆమోదం తెలిపిందని చెప్పారు. కుంభమేళాకు ముందు ఈ నిర్ణయం తీసుకోవడం చాలా సంతోషంగా ఉందని తెలిపారు. రుగ్వేదం, మహాభారతం, రామాయణాల్లో ప్రయాగ్ రాజ్ అనే పేరు ఉంటుందని చెప్పారు. అలహాబాద్ పేరును ప్రయాగ్ రాజ్ గా మార్చాలనేది నగర ప్రజలు, సాధువులు, పీఠాధిపతుల కోరిక అని తెలిపారు.

కుంభమేళాకు సంబంధించి రెండు రోజుల క్రితం నిర్వహించిన మీటింగ్ లో అలహాబాద్ పేరును ప్రయాగ్ రాజ్ గా మార్చాలనే విషయన్ని స్వయంగా ముఖ్యమంత్రి వెల్లడించారని సిర్ధార్థ్ నాథ్ సింగ్ చెప్పారు. యోగి నిర్ణయానికి పీఠాధిపతులు, సాధువులు వెంటనే ఆమోదం తెలిపారని అన్నారు. మరోవైపు, అలహాబాద్ పేరు మార్చకూడదని ప్రతిపక్షాలు ఆందోళనలు నిర్వహించాయి. అయినా వేటినీ లెక్క చేయకుండా మోగి సర్కారు పేరును మారుస్తూ నిర్ణయం తీసుకుంది. 

More Telugu News