nani: గ్రామీణ నేపథ్యంలో కథ .. రైతు పాత్రలో నాని?

  • విజయదశమి రోజున 'జెర్సీ' లాంచ్ 
  • ఆ తరువాత సినిమాకి సన్నాహాలు 
  • 14 రీల్స్ బ్యానర్ పై నిర్మాణం

ప్రస్తుతం నాని 'జెర్సీ' సినిమా చేయడానికి రెడీ అవుతున్నాడు. క్రికెట్ నేపథ్యంలో సాగే కథ ఇది. ఇందుకోసం నాని కొంతకాలంగా క్రికెట్ లో శిక్షణ తీసుకుంటున్నాడు. ఈ నెల 18వ తేదీన ఈ సినిమాను లాంచ్ చేయనున్నారు. ఇందుకు అవసరమైన సన్నాహాలు చకచకా జరిగిపోతున్నాయి. ఈ సినిమా సెట్స్ పైకి వెళుతుండగానే మరో ప్రాజెక్టుకు నాని గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా సమాచారం.

ఇటీవలనే కిషోర్ అనే దర్శకుడు నానిని కలిసి ఒకలైన చెప్పాడట. కథలోని కొత్తదనం కారణంగా .. తాను ఇంతవరకూ చేయని పాత్ర కారణంగా వెంటనే నాని ఈ సినిమాకి ఓకే చెప్పేసినట్టుగా తెలుస్తోంది. ఈ కథ పూర్తిగా గ్రామీణ వాతావరణంలో కొనసాగుతుంది. రైతు పాత్రలో నాని కనిపించనున్నాడని అంటున్నారు. 14 రీల్స్ ప్లస్ బ్యానర్ పై ఈ సినిమా రూపొందనుంది. ప్రస్తుతం కథానాయిక అన్వేషణలో టీమ్ వుంది. త్వరలోనే ఈ ప్రాజెక్టుకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియనున్నాయి.   

More Telugu News