Banglore: అమ్మాయిని వేధించడంతో కబడ్డీ కోచ్ సస్పెన్షన్.. మనస్తాపంతో ఆత్మహత్య చేసుకున్న కోచ్!

  • బెంగళూరులో ఘటన
  • 13 ఏళ్ల బాలికను వేధించి సస్పెండైన కోచ్
  • హోటల్ గదిలో ఆత్మహత్య

తన వద్ద శిక్షణకు వచ్చిన ఓ మైనర్ క్రీడాకారిణిని లైంగికంగా వేధించి, ఆపై ఉద్యోగాన్ని పోగొట్టుకున్న ఓ కోచ్ మనస్తాపంతో ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన బెంగళూరులో జరిగింది. ఇక్కడి స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా శిక్షణా కేంద్రంలో రుద్రప్ప హోషమణి (59) కబడ్డీ కోచ్ గా సేవలందిస్తున్నాడు. తన వద్దకు శిక్షణకు వచ్చిన 13 ఏళ్ల అమ్మాయి, దుస్తులు మార్చుకునేందుకు వెళ్లగా, ఆమెతో పాటు వెళ్లి వేధించాడు.

దీంతో ఆ బాలిక తన తల్లిదండ్రుల సాయంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆపై హోషమణిపై కేసు నమోదుకాగా, ఇంటర్నల్ ఎంక్వయిరీలో అతనిపై ఆరోపణలు నిజమేనని స్పోర్ట్స్ అథారిటీ తేల్చింది. దీంతో ఆయన్ను సస్పెండ్ చేశారు. ఈ క్రమంలో హరిహరటౌన్ ప్రాంతంలోని ఓ హోటల్ గదికి వచ్చిన ఆయన, సూసైడ్ చేసుకున్నాడు.

అంతకుముందు ఓ లేఖను రాస్తూ, తనపై కేసుతో ఆవేదక కలిగిందని, తనను క్షమించాలని కోరుతూ భార్య దేవిక, కుమారుడు రాకేష్ లను ఉద్దేశించి వ్యాఖ్యానించాడు. హోటల్ గది నుంచి వాసన వస్తుండటంతో పోలీసులు వచ్చి తలుపులు పగులగొట్టి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నట్టు తెలిపారు.

More Telugu News