Anthariksham Movie: రెండు రోజుల్లో ఆకాశాన్ని చేరుకోబోతున్నాం: వరుణ్ తేజ్

  • మరో రెండు రోజుల్లో ‘అంతరిక్షం’ టీజర్
  • 17న సాయంత్రం 4 గంటలకు విడుదల
  • టీజర్‌కి సంబంధించిన పోస్టర్ విడుదల

సంకల్ప్ రెడ్డి దర్శకత్వంలో మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి జంటగా నటిస్తున్న అడ్వెంచరస్ స్పేస్ థ్రిల్లర్ మూవీ ‘అంతరిక్షం’. టాలీవుడ్‌లో ఇంతవరకూ రాని కాన్సెప్ట్‌తో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఇటీవలే ఈ సినిమా ఫస్ట్‌లుక్ విడుదలై సినిమాపై అంచనాలను పెంచేసింది. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన టీజర్ రిలీజ్ కాబోతోంది.

ఈ విషయాన్ని కాస్త డిఫరెంట్‌గా వెల్లడించిన వరుణ్ తేజ్.. దీనికి సంబంధించిన పోస్టర్‌ను కూడా ట్విట్టర్ ద్వారా విడుదల చేశారు. ‘రెండు రోజుల్లో ఆకాశాన్ని చేరుకోబోతున్నాం. దీనికి సంబంధించిన మిషన్ అక్టోబర్ 17, సాయంత్రం 4 గంటలకు మొదలవుతుంది’ అని ట్వీట్ చేసిన వరుణ్ అంతరిక్షం టీజర్‌ను 17న రిలీజ్ చేయబోతున్నట్టు ప్రకటించారు.

More Telugu News