Sripada Chinmayi: లైంగిక ఆరోపణలన్నీ అవాస్తవాలే.. నిజమైతే నాపై కేసు పెట్టొచ్చు!: వైరముత్తు

  • మంచివాడినో, చెడ్డవాడినో ఒకరు చెప్పనక్కర్లేదు
  • చట్టపరంగా ఎదుర్కోవడానికి సిద్ధం
  • కోర్టు తీర్పును స్వాగతిస్తా

తమిళ సినీ గీత రచయిత వైరముత్తు తనను హోటల్ గదికి రమ్మని కబురు పంపారని పేర్కొంటూ ప్రముఖ గాయని చిన్మయి శ్రీపాద ఇటీవల తీవ్ర ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. దీనిపై మాట్లాడుతూ తాజాగా వైరముత్తు ఓ వీడియో విడుదల చేశారు. తనపై వస్తున్న లైంగిక ఆరోపణలన్నీ అవాస్తవమేనని ఆయన తేల్చిచెప్పారు.

ఆ వీడియోలో ఆయన మాట్లాడుతూ.. ఒకవేళ ఆ ఆరోపణలు నిజమైతే.. ఆ మహిళలు తనపై నిరభ్యంతరంగా కేసు పెట్టొచ్చన్నారు. చట్టపరంగా దానిని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నానన్న వైరముత్తు... తాను ఎటువంటి వాడినో ఒకరు చెప్పనక్కర్లేదన్నారు. ఆ విషయాన్ని న్యాయస్థానమే నిర్ణయిస్తుందని... కోర్టు చెప్పిన దానిని తాను అంగీకరిస్తానని ఆ వీడియోలో పేర్కొన్నారు. 

More Telugu News