shirdi: షిర్డీ సాయి సమాధికి నేటితో వందేళ్లు!

  • 1918 అక్టోబర్ 15న మహా సమాధి
  • 60 ఏళ్ల పాటు షిర్డీలో నివసించిన సాయిబాబా
  • 50 దేశాల్లో 8వేలకు పైగా సాయిబాబా ఆలయాలు

ఎంతో మంది భక్తి శ్రద్ధలతో కొలిచే షిర్డీ సాయిబాబా మహాసమాధి చెంది నేటితో వందేళ్లు పూర్తయ్యాయి. 1918 అక్టోబర్ 15వ తేదీన ఆయన సమాధి అయ్యారు. షిర్డీలో దాదాపు 60 ఏళ్ల పాటు సాయిబాబా నివసించారు. సాయిబాబా హిందూ, ఇస్లాం రెండు సంప్రదాయాలను పాటించారు. నమాజ్ చదవడం, ఖురాన్ ను అధ్యయనం చేయడం వంటి ఆచారాలను ప్రోత్సహించారు. భగవద్గీత, రామాయణం, విష్ణు సహస్రనామ స్త్రోత్రాలను పారాయణం చేయాలని హిందువులకు సూచించారు.

సాయిబాబాకు దేశంలోనే కాకుండా దాదాపు 50 దేశాల్లో 8 వేలకు పైగా ఆలయాలు ఉన్నాయి. మన దేశంలో పద్మనాభస్వామి ఆలయం, తిరుమల తర్వాత అత్యంత సంపన్నమైన ఆయలం షిర్డీ సాయిబాబాదే. సాయి సంస్థాన్ బ్యాంకు ఖాతాల్లో రూ. 1800 కోట్ల సొమ్ము ఉంది.

More Telugu News