Maharashtra: మద్యం డోర్ డెలివరీ నిర్ణయం ఎప్పటికీ తీసుకోబోం: మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్

  • మద్యం డోర్ డెలివరీ ప్రతిపాదన చేసిన మంత్రి చంద్రశేఖర్
  • ఈ ప్రతిపాదనపై నిరసనల వెల్లువ
  • స్పందించిన దేవేంద్ర ఫడ్నవీస్

మహారాష్ట్రలో డ్రంకెన్ డ్రైవ్ కేసుల సంఖ్య తగ్గించే క్రమంలో భాగంగా మద్యం డోర్ డెలివరీ ప్రతిపాదన చేసినట్టు ఆ రాష్ట్ర ఎక్సైజ్ మంత్రి చంద్రశేఖర్ బవంకులే ఇటీవల ప్రకటించారు. ఈ ప్రకటనపై నిరసనలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ స్పందిస్తూ ఓ ప్రకటన చేశారు. మహారాష్ట్ర ప్రభుత్వం అలాంటి నిర్ణయమేదీ తీసుకోలేదని.. తీసుకోబోదని స్పష్టం చేశారు.

ఇదిలా ఉండగా, మద్యం డోర్ డెలివరీ ప్రకటనపై నిరసనలు వెల్తువెత్తిన విషయమై మహారాష్ట్ర ఎక్సైజ్ శాఖకు చెందిన ఓ ఉన్నతాధికారి మాట్లాడుతూ, ఇది తప్పుడు సంప్రదాయానికి దారి తీస్తుందని విమర్శలు వచ్చాయని, చట్టవిరుద్ధమని అన్నారు. మద్యం డోర్ డెలివరీ ప్రతిపాదన సబబు కాదని, దీని వల్ల మద్యం అక్రమ సరఫరాకు ఆస్కారముందని అభిప్రాయపడ్డారు.

More Telugu News