Pawan Kalyan: పవన్ కల్యాణ్ మానియా.. అమెరికాలో కార్లతో అభిమానుల భారీ ర్యాలీ.. స్పెషల్ వీడియో విడుదల!

  • అమెరికాలోని వర్జీనియాలో సందడి
  • కార్లతో ర్యాలీ తీసిన పవన్ అభిమానులు
  • జై జనసేన అంటూ నినాదాలు

ఈ రోజు మధ్యాహ్నం 3 గంటలకు ధవళేశ్వరం సమీపంలోని పిచ్చుకలంక నుంచి సర్ ఆర్ధర్ కాటన్ విగ్రహం వరకూ జనసేన పార్టీ 'జనసేన కవాతు'ను నిర్వహించనున్న సంగతి విదితమే. ఈ నేపథ్యంలో జనసేన కవాతుకు మద్దతుగా పవన్ కల్యాణ్ అభిమానులు అమెరికాలోని వర్జీనియాలో కార్లతో భారీ ర్యాలీ చేపట్టారు.


జనసేన జెండాలు రెపరెపలాడుతుండగా, కార్లు ఒకదాని వెంట మరొకటి దూసుకెళ్లాయి. ఈ సందర్భంగా ఓ చోటుకు చేరుకున్న అభిమానులు జై జనసేన, జై పవన్ కల్యాణ్ నినాదాలతో హోరెత్తించారు. అనంతరం కార్లను ‘జన సేన’ అనే ఇంగ్లిష్ అక్షరాల్లో ఉన్నట్లు పార్క్ చేసి తమ అభిమానాన్ని తెలియజేశారు. దీన్ని ప్రత్యేకమైన డ్రోన్ తో చిత్రీకరించారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. దీన్ని మీరూ చూసేయండి.

More Telugu News