maoists: మావోయిస్టు మీనాను పోలీసులు కాల్చి చంపారు: అమర వీరుల బంధుమిత్రుల సంఘం

  • ఎదురు కాల్పుల ఘటన ఒట్టి బూటకం
  • ఈనెల 11న మీనాను అదుపులోకి తీసుకుని చిత్రహింసలకు గురిచేశారు
  • లొంగక పోవడంతో కాల్చిచంపేసి ఎన్‌కౌంటర్‌ కథ అల్లారు

మావోయిస్టు మీనాను పోలీసులు కాల్చిచంపి ఎన్‌కౌంటర్‌ కథ అల్లారని అమరవీరుల బంధుమిత్రుల సంఘం, విరసం ఆరోపించాయి. ఈనెల 11న మీనాను పట్టుకుని చిత్రహింసలకు గురిచేశారని, ఆమె లొంగక పోవడంతో ఈనెల 12వ తేదీన హత్య చేశారని సంఘం అధ్యక్షురాలు భవాని, విరసం నేత బషీద్‌ ఆరోపించారు. మల్కన్‌గిరి జిల్లా చిత్రకొండ కటాఫ్‌ ఏరియా ఆంధ్ర-ఒడిశా సరిహద్దుల్లో ఈనెల 12న జరిగిన ఎదురుకాల్పుల్లో కిడారి, సివేరి హత్య కేసుల్లో పాల్గొన్న మీనా చనిపోయినట్లు పోలీసులు చెప్పిన విషయం తెలిసిందే.

అయితే, దీన్ని బూటకపు ఎన్‌కౌంటర్‌గా బంధుమిత్రుల సంఘం, విరసం నేతలు కొట్టిపారేశారు. వరంగల్‌ జిల్లాలోని పొచ్చన్నపేటలో మీనాకు ఆదివారం అంత్యక్రియలు నిర్వహించారు. విప్లవ జోహార్లు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మావోయిస్టులను చంపడమే లక్ష్యంగా పెట్టుకుని కూంబింగ్‌ చేపట్టిన పోలీసులు మీనాను హత్య చేశారన్నారు. కాగా, మల్కన్‌ గిరి పోలీసుల అదుపులో ఉన్న మరో నలుగురు మావోయిస్టులను కోర్టుకు తరలించినట్లు ఎస్పీ జోగ్గా మోహన్‌ తెలిపారు.

More Telugu News