John Hestings: బౌలింగ్ చేస్తుంటే రక్తపు వాంతులు... ప్రమాదంలో ఆసీస్ క్రికెటర్ జాన్ హేస్టింగ్స్!

  • హేస్టింగ్స్ ఊపిరితిత్తుల్లో సమస్య
  • ఎగజిమ్ముతున్న రక్తం, దగ్గితే నోటిద్వారా బయటకు
  • ఇకపై బౌలింగ్ చేసేది అనుమానమే!

ఆస్ట్రేలియన్ యువ క్రికెటర్, పేస్ బౌలర్ జాన్ హేస్టింగ్స్, అంతు చిక్కని జబ్బుతో బాధపడుతూ, తన కెరీర్ ను, ఆరోగ్యాన్ని ప్రమాదంలో పడేసుకున్నాడు. హేస్టింగ్స్ ఊపిరితిత్తుల్లో సమస్య కారణంగా, బౌలింగ్ చేసిన ప్రతిసారీ రక్తపు వాంతులు అవుతున్నాయి. బౌలింగ్ రన్నప్ కారణంగా ఊపిరితిత్తుల నుంచి రక్తం పైకి ఎగజిమ్మి, తరువాత దగ్గినప్పుడు అది నోటి ద్వారా బయటకు వస్తోంది.

దీనివల్ల భవిష్యత్తులో ఎటువంటి సమస్య ఉండబోదని వైద్యులు భరోసా ఇవ్వట్లేదని చెప్పిన హేస్టింగ్స్, ఇకపై తాను బౌలింగ్ చేస్తానో లేదో తెలియడం లేదని అన్నాడు. తాను పరిగెత్తగలనని, బాక్సింగ్, రోయింగ్ చేస్తానని, వెయిట్ లిఫ్టింగ్ లో కూడా ప్రవేశముందని చెప్పిన హేస్టింగ్స్, కేవలం బౌలింగ్ చేసినప్పుడు మాత్రమే రక్తం పడుతోందని వాపోయాడు. కాగా, జాన్ హేస్టింగ్స్ ఇప్పటివరకూ ఆస్ట్రేలియా తరఫున ఒక టెస్టు, 29 వన్డేలు, 9 టీ-20 మ్యాచ్ లూ ఆడాడు.

More Telugu News