Pavan Kalyan: పవన్ కల్యాణ్‌పై కత్తి మహేష్ మరోసారి సంచలన వ్యాఖ్యలు

  • బీజేపీకి పవన్ ఏజెంట్
  • 500 మంది ఓటర్లను కూడా ప్రభావితం చేయలేడు
  • ఎప్పుడు ఏ నిర్ణయం తీసుకుంటాడో తెలియదు

మరోసారి జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై ప్రముఖ సినీ విమర్శకుడు కత్తి మహేష్ సంచలన వ్యాఖ్యలు చేశారు. గత కొంతకాలంగా పవన్ ఊసెత్తని మహేష్ నేడు తీవ్ర విమర్శలు చేశారు. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో మాదిగల రాజకీయ చైతన్య సభలో ఆయన మాట్లాడుతూ.. బీజేపీకి పవన్‌ కల్యాణ్ ఏజెంట్ అని ఆరోపించారు. పవన్ ఒక్కో నియోజకవర్గంలో 500 మంది ఓటర్లను కూడా ప్రభావితం చేయలేడని ఎద్దేవా చేశారు. ఎవరు డబ్బులు ఇస్తే వారికే పవన్ వత్తాసు పలుకుతాడని కత్తి మహేశ్ అన్నారు. పవన్‌ ఎప్పుడు ఏ నిర్ణయం తీసుకుంటాడో అతనికే తెలియదన్నారు.

More Telugu News