India: భారత్ కు కఠిన హెచ్చరికలు చేసిన పాకిస్థాన్!

  • ఒకసారి దాడి చేస్తే 10 సార్లు దాడి చేస్తాం
  • సాహసం చేసేముందు మా సామర్థ్యం గుర్తించండి
  • పాకిస్థాన్ మేజర్ జనరల్ ఆసిఫ్ గఫూర్

"మా భూభాగంపై ఇండియా ఒక్కసారి సర్జికల్ దాడి చేస్తే, మేము పది సార్లు భారత్ లోకి చొరబడి అటువంటి దాడులనే చేసి మా సత్తా చాటుతాం" అంటూ పాకిస్థాన్ మేజర్ జనరల్ ఆసిఫ్ గఫూర్ కటువు వ్యాఖ్యలు చేశారు. రెండు దేశాల మధ్యా మాటల యుద్ధం జరుగుతున్న ఈ సమయంలో పాక్ మిలటరీ ఇంటర్ సర్వీసెస్ పబ్లిక్ రిలేషన్స్ ప్రతినిధిగా ఉన్న ఆసిఫ్, లండన్ లో మీడియాతో ఆర్మీ చీఫ్ జనరల్ ఒమర్ జావేద్ బజ్వాతో కలసి మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.

ఏదైనా సాహసం చేసేముందు పాకిస్థాన్ సైనిక బలగాన్ని, తమ సామర్థ్యాన్ని దృష్టిలో ఉంచుకోవాలని ఆయన హెచ్చరించారు. చైనా, పాకిస్థాన్ ఎకనామిక్ కారిడార్ ను తమ సైన్యం కంటికి రెప్పలా కాపాడుతోందని, దేశంలో ప్రజాస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసేందుకు కట్టుబడి వున్నామని ఆయన అన్నారు. పాకిస్థాన్ లో మీడియాకు స్వాతంత్ర్యం లేదని వస్తున్న విమర్శలపై స్పందిస్తూ, తమ దేశంలో ప్రసార మాధ్యమాలకు పూర్తి స్వాతంత్ర్యం ఉందని వ్యాఖ్యానించారు.

More Telugu News