Imran Ali: తన చిన్నారిని చిదిమేసిన రాక్షసుడిని బహిరంగంగా ఉరి తీయాలంటూ తండ్రి పిటిషన్!

  • ఈ నెల 17న ఇమ్రాన్ అలీకి ఉరి
  • అక్టోబర్ 15న పిటీషన్‌పై విచారణ
  • అలీ క్షమాభిక్ష పిటీషన్ తిరస్కరణ

ఈ ఏడాది జనవరిలో పాకిస్థాన్ లోని కసూర్‌ ప్రాంతంలో ఇమ్రాన్‌ అలీ అనే వ్యక్తి ఏడేళ్ల చిన్నారిని అపహరించి అత్యంత పాశవికంగా అత్యాచారం చేసి హత్య చేసి మృతదేహాన్ని ఇంటికి సమీపంలోని చెత్తలో పడేసిన విషయం తెలిసిందే. పాకిస్థాన్‌ వ్యాప్తంగా ఈ కేసు సంచలనం సృష్టించింది. ఈ కేసులో దోషిగా తేలిన అలీకి లాహోర్‌ న్యాయస్థానం 21 మరణశిక్షలు విధించింది. ఈ నెల 17న లాహోర్‌లోని సెంట్రల్‌ జైలులో అతడిని ఉరి తీయనున్నారు.

అయితే తన చిట్టి తల్లిపై అంతటి ఘోరానికి ఒడిగట్టిన ఇమ్రాన్‌ను బహిరంగంగా ఉరితీయాలని బాధిత చిన్నారి తండ్రి లాహోర్‌ హైకోర్టులో పిటిషన్‌ వేశాడు. ఈ పిటిషన్‌ విచారణను ఈ నెల 15న చేయనున్నారు. భవిష్యత్‌లో ఎవరూ ఇటువంటి నేరాలు చేయకుండా భయం ఉండే విధంగా ఉరి అమలు చేయాలని ఆయన పిటిషన్‌లో పేర్కొన్నాడు. అయితే తనకు క్షమాభిక్ష పెట్టాల్సిందిగా కోరుతూ అలీ పెట్టుకున్న పిటిషన్‌ను లాహోర్‌ హైకోర్టుతో పాటు, పాక్‌ సుప్రీంకోర్టు, ఆ దేశ అధ్యక్షుడు తిరస్కరించారు.

More Telugu News