sbi: ఎస్బీఐ నెట్ బ్యాంకింగ్ యూజర్లు తమ మొబైల్ నెంబర్లు వెంటనే రిజిస్టర్ చేయించుకోవాలి: ఎస్బీఐ ప్రకటన

  • లేనిపక్షంలో డిసెంబర్ 1 నుంచి సేవలు నిలిపివేస్తాం
  • ఇచ్చిన గడువులోగా రిజిస్టర్ చేయించుకోవాలి
  • ఎస్బీఐ వెబ్ సైట్ లో పొందుపరిచిన వివరాలు

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇంటర్నెట్ బ్యాంకింగ్ యూజర్లు తమ మొబైల్ నెంబర్లను వెంటనే రిజిస్టర్ చేయించుకోవాలని ఎస్బీఐ ఓ ప్రకటనలో పేర్కొంది. లేనిపక్షంలో ఈ ఏడాది డిసెంబర్1 నుంచి వారి ఇంటర్నెట్ బ్యాంకింగ్ సేవలు నిలిపివేయబడతాయని పేర్కొంది. ఇచ్చిన గడువు తేదీలోగా ఇంటర్నెట్ బ్యాంకింగ్ యూజర్లు తమ మొబైల్ నెంబర్లను రిజిస్టర్ చేయించుకోవాలని వినియోగదారులకు సూచించింది.

 ఇందుకు సంబంధించిన వివరాలను ఎస్బీఐ వెబ్ సైట్ లో పొందుపరిచింది. కాగా, ఖాతాదారుల బ్యాంకింగ్ లావాదేవీలకు సంబంధించి ఎప్పటికప్పుడు ఎస్ఎంఎస్, ఈ-మెయిల్ అలర్ట్ ల ద్వారా యూజర్లకు తప్పనిసరిగా తెలియజేయాలని ఆర్బీఐ గత ఏడాదిలో అన్ని బ్యాంకులకు సర్క్యులర్ జారీ చేసింది. ఇందులో భాగంగానే ఎస్బీఐ తాజాగా ఈ ప్రకటన చేసింది. 

More Telugu News