ntr: అందుకే మరింత పట్టుదలతో పనిచేశాను: తమన్

  • ముందుగా అనిరుథ్ ను తీసుకున్నారు 
  • ఆ తరువాత నాకు ఛాన్స్ ఇచ్చారు 
  • పడిన కష్టానికి ఫలితం దక్కింది

ఎన్టీఆర్ హీరోగా త్రివిక్రమ్ తెరకెక్కించిన 'అరవింద సమేత వీర రాఘవ' .. ప్రస్తుతం థియేటర్స్ లో సందడి చేస్తోంది. పూజా హెగ్డే కథానాయికగా నటించిన ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ఇక ఈ సినిమాలోని పాటలకు మంచి మార్కులు పడిపోతున్నాయి. ఈ సందర్భంగా సంగీత దర్శకుడు తమన్ స్పందించాడు.

"ముందుగా ఈ సినిమాకి సంగీత దర్శకుడిగా అనిరుథ్ ను తీసుకున్నారు. అయితే కొన్ని కారణాల వలన ఆయన స్థానంలోకి నన్ను తీసుకున్నారు. అనిరుథ్ ను మార్చి అవకాశం నాకు ఇవ్వడం వలన, ఈ సినిమాకి మరింత కష్టపడి పనిచేయాలనే కసి పెరిగింది. ఎన్టీఆర్ - త్రివిక్రమ్ పట్ల గల అభిమానం మరింత కష్టపడేలా చేసింది. ఎలాంటి టెన్షన్స్ పెట్టుకోకుండా ఒక ఛాలెంజింగ్ గా తీసుకుని ఈ సినిమాకి పనిచేశాను. అందుకు తగిన ఫలితం దక్కిందనే విషయం ఆడియన్స్ రెస్పాన్స్ వలన అర్థమవుతోంది. ఇక ఈ సినిమా విడుదల కాగానే అనిరుథ్ కాల్ చేసి అభినందించడం గొప్ప విషయం" అని తమన్ చెప్పుకొచ్చాడు. 

More Telugu News