ntr: 'అరవింద సమేత' రెండు రోజుల షేర్

  • భారీ ఓపెనింగ్స్ తెచ్చుకున్న 'అరవింద'
  • రెండవ రోజున అదే జోరు 
  • వీకెండ్ లో భారీగా పెరగనున్న వసూళ్లు

దసరా కానుకగా 'అరవింద సమేత వీర రాఘవ' సినిమా, ఈ నెల 11వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్ లోను ఈ సినిమా భారీ వసూళ్లను రాబడుతూ దూసుకుపోతోంది. ఇంతవరకూ ఎన్టీఆర్ చేసిన సినిమాలు ఒక ఎత్తు .. ఈ సినిమా ఒక ఎత్తు అని చెప్పుకుంటున్నారు. తెలుగు రాష్ట్రాల్లో రెండు రోజుల్లో ఈ సినిమా 35 కోట్లకి పైగా షేర్ ను వసూలు చేసింది.

ఇక ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే 40 కోట్లకి పైగా షేర్ ను రాబట్టింది. మరో వారం రోజుల పాటు దసరా సెలవులే కావడంతో ఈ సినిమా వసూళ్ల పరంగా కొత్త రికార్డులను సృష్టించడం ఖాయమని చెప్పుకుంటున్నారు. ఈ శని .. ఆదివారాల్లోనే వసూళ్లు ఒక రేంజ్ లో పెరిగిపోవచ్చని అంటున్నారు. కథ .. కథనం .. మాటలు .. పాటలు .. ఫైట్లు ..ఇలా అన్నీ సమపాళ్లలో కుదరడం వలన, అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చేలా ఉండటం వలన ఈ సినిమా ఈ స్థాయి వసూళ్లను రాబడుతోందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.       

More Telugu News