amitsha: ఆరోపణలు చేయడం సులభం... నిజాలు తెలుసుకోవాలి!: అమిత్‌ షా

  • ఎం.జె.అక్బర్‌పై వస్తున్న లైంగిక ఆరోపణల నేపథ్యంలో స్పందన
  • నా పేరును కూడా ఉపయోగించుకుని చేయొచ్చు
  • వాస్తవాలు తెలుసుకుని స్పందించడం చాలా అవసరం

‘ఎవరిపైనైనా ఆరోపణలు చేయడం సులభం...రేపు నాపైనా చేయొచ్చు. అదేం పెద్దకష్టమైన పనేం కాదు. కాకుంటే నిజానిజాలు  తెలుసుకోకుండా స్పందించడం సరికాదు. వాస్తవాలను కూలంకుషంగా తెలుసుకుని మాట్లాడాలి’ అని బీజేపీ చీఫ్‌ అమిత్‌ షా అన్నారు. మీటూ ఉద్యమం నేపథ్యంలో కేంద్ర మంత్రి ఎం.జె.అక్బర్‌పై వస్తున్న ఆరోపణలపై ఓ చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో షా ఇలా స్పందించారు.

అక్బర్‌పై ఇప్పటికే ఎందరో మహిళలు లైంగిక ఆరోపణలు చేయగా తాజాగా ఓ విదేశీ మహిళా జర్నలిస్టు సైతం అక్బర్‌ తనను లైంగికంగా వేధించాడని ఆరోపించిన విషయం తెలిసిందే. దీనిపై అమిత్‌ షా మాట్లాడుతూ సాధారణంగా చిన్నచిన్న వెబ్‌సైట్లలో ఇటువంటి ఆరోపణలు వస్తుంటాయి. వాటన్నింటినీ వంద శాతం నిజంగా పరిగణించకూడదు. వాటి లోతుల్ని పరిశీలించి అప్పుడు స్పందిస్తే బాగుంటుందని అన్నారు. ఎం.జె.అక్బర్‌పై వస్తున్న లైంగిక ఆరోపణ అంశంపై తప్పకుండా పార్టీ దృష్టిసారిస్తుందని స్పష్టం చేశారు.

More Telugu News