kaushal: నా గెలుపుకి 'బిగ్ బాస్ 2' నిర్వాహకులు సపోర్ట్ చేశారనడం అబద్ధం: కౌశల్

  • నేను విన్ అవుతానని నాకు తెలుసు 
  • ఎలాంటి మ్యాచ్ ఫిక్సింగ్ లేదు 
  • హౌస్ లో అందరూ సమానమే

తాజాగా టీవీ 9 ఇంటర్వ్యూలో "రెండు నెలల క్రితమే 'బిగ్ బాస్ 2' విన్నర్ కౌశల్ అని డిసైడ్ అయింది .. అది ఎలాగా?' అనే ప్రశ్న కౌశల్ కి ఎదురైంది. అందుకు కౌశల్ స్పందిస్తూ .. "నేను హౌస్ లో వున్నప్పుడు నాల్గొవ వారంలోనే 'బిగ్ బాస్ 2' విన్నర్ నేనే అనే విషయాన్ని నేనే డిసైడ్ అయ్యాను. ఫస్టు వీక్ లోనే మిగతా ఇంటి సభ్యులందరి మైండ్ సెట్ ను నేను క్లియర్ గా చదవడం జరిగింది. ఈ కారణంగానే ఏ వారం ఎవరు ఎలిమినేట్ అవుతారనేది చెప్పగలిగాను" అన్నారు.

'అందువల్లనే ఈ కార్యక్రమాన్ని ఫాలో అయ్యేవారికి మీరే ఈ ప్రోగ్రామ్ ను డిజైన్ చేసినట్టుగా అనిపించింది. ఇక్కడే మీకు .. ఛానల్ నిర్వాహకులకు మధ్య ఏదైనా మ్యాచ్ ఫిక్సింగ్ జరిగిందా? అనే అనుమానం కూడా వాళ్లకి వచ్చింది. మీ గెలుపుకు ఛానల్ నిర్వాహకులు పరోక్షంగా సపోర్ట్ చేశారని కూడా అనుకుంటున్నారు .. ఇందులో నిజమెంత?' అనే ప్రశ్న జాఫర్ నుంచి ఎదురైంది.

అప్పుడు కౌశల్ 'అది హండ్రెడ్ పర్సెంట్ రాంగ్ .. 'బిగ్ బాస్ 2'కి సెలెక్ట్ అయినట్టుగా మిగతా సభ్యులకు 45 రోజుల ముందు తెలిస్తే, నాకు ఓ 10 రోజుల ముందు మాత్రమే తెలిసింది. హౌస్ లోకి వెళ్లిన తరువాత ఇంటి సభ్యులందరినీ సమానంగానే చూశారు. ఎవరు ఎలా గేమ్ ఆడతారో నిర్వాహకులకే తెలియదు .. అలాంటప్పుడు ఎలా సపోర్ట్ చేస్తారు?' అంటూ ఖండించాడు.  

More Telugu News