metoo: సామాజిక మార్పునకు దోహద పడుతున్న మీటూ ఉద్యమం : సింగర్‌ చిన్మయి

  • దక్షిణాదిలో ఉద్యమానికి మంచి మద్దతు
  • బాధితులు ధైర్యంగా ముందుకు వస్తున్నారు
  • వారిని మహిళా జర్నలిస్టులతో మాట్లాడిస్తా

సామాజిక మార్పునకు మీటూ ఉద్యమం దోహద పడుతుందని డబ్బింగ్‌ ఆర్టిస్ట్‌, సింగర్‌ చిన్మయి అభిప్రాయపడ్డారు. సొసైటీలో బయటకు మంచి వాళ్లుగా నటించే ప్రముఖుల లోలోపలి చేష్టలు వెలుగు చూడడంతో బాధితులకు ఊరట కలుగుతోందన్నారు. ప్రముఖ రచయిత వైరముత్తు సమాజంలో మంచి వ్యక్తిగా పేరొందాడు.

కానీ, లిరిక్స్‌ గురించి వివరించే సమయంలో కౌగిలించుకోవడం, వెకిలి చేష్టలు చేయడం చేసేవాడని ఇటీవల చిన్మయి ట్వీట్‌లో పేర్కొన్న విషయం తెలిసిందే. కర్ణాటక సంగీత ప్రపంచంలో ఎంతోమంది ప్రముఖులు మహిళలను లైంగికంగా వేధించారు. అటువంటి బాధితులను మహిళా జర్నలిస్టులతో మాట్లాడించే ప్రయత్నం చేస్తున్నట్లు చిన్మయి తెలిపింది. దక్షిణాదిలో మీటూ ఉద్యమాన్ని చిన్మయి ఉద్ధృతం చేసిన విషయం తెలిసిందే. ఈమెకు సమంత, రకుల్‌తోపాటు పలువురు ప్రముఖులు మద్దతుగా నిలిచారు.

More Telugu News