Chandrababu: యుద్ధ ప్రాతిపదికన పునరుద్ధరణ పనులు చేపట్టండి: చంద్రబాబు

  • తుపానుపై పలాసలో సమీక్ష నిర్వహించిన చంద్రబాబు
  • మృతుల కుటుంబాలకు రూ. 5 లక్షల పరిహారం
  • భౌగోళికంగా తుపాన్ల బారిన పడే రాష్ట్రం ఏపీ

భౌగోళికంగా తుపాన్ల బారిన పడే రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. ఈరోజు ఆయన పలాస మున్సిపల్ కార్యాలయంలో అధికారులతో సమీక్ష నిర్వహించారు. తెల్లరేషన్ కార్డు ఉన్నవారికి 25 కిలోల బియ్యం, కిలో నూనె, కందిపప్పు, బంగాళాదుంపలు, అరకిలో పంచదార పింపిణీ చేయాలని ఈ సందర్భంగా ఆయన ఆదేశించారు. మత్స్యకార కుటుంబాలకు సరుకులతో పాటు 50 కిలోల బియ్యం ఇవ్వాలని చెప్పారు.

మృతి చెందిన కుటుంబాలకు రూ. 5 లక్షల ఎక్స్ గ్రేషియాను చంద్రబాబు ప్రకటించారు. పూర్తిగా ధ్వంసమైన పడవలకు రూ. 10 వేలు, పాక్షికంగా దెబ్బతిన్న పడవలకు రూ. 5 లక్షలు, వలలకు రూ. 2,500, పూర్తిగా దెబ్బతిన్న ఇళ్లకు రూ. 1.5 లక్షలు, పాక్షికంగా దెబ్బతిన్న ఇళ్లకు రూ. 50 వేల పరిహారాన్ని ప్రకటించారు. యుద్ధ ప్రాతిపదికన పునరుద్ధరణ పనులను చేపట్టాలని ఆదేశించారు.

More Telugu News