united Nations: ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల మండలిలో భారత్‌కు ప్రాతినిధ్యం

  • ఈ స్థానం కోసం జరిగిన ఎన్నికల్లో భారీ ఓట్ల మెజార్టీతో గెలుపు
  • 193 సభ్య దేశాల్లో 188 మంది మద్దతు
  • ఆసియా - పసిఫిక్‌ కేటగిరీలో భారత్‌కు దక్కిన గౌరవం

ఐక్యరాజ్య సమితిలో భారత్‌ తన సత్తా చాటింది. మానవ హక్కుల మండలిలో స్థానం కోసం జరిగిన ఎన్నికల్లో భారీ ఓట్ల మెజార్టీతో గెలుపొంది అరుదైన గౌరవం సొంతం చేసుకుంది. ఆసియా - పసిఫిక్‌ కేటగిరీలో జరిగిన ఎన్నికల్లో మొత్తం 193 సభ్య దేశాల్లో 188 మంది మద్దతు పలకడంతో మానవ హక్కుల మండలికి ఎంపికైంది.

 వచ్చే ఏడాది జనవరి ఒకటి నుంచి అమల్లోకి వచ్చే ఈ సభ్యత్వం మూడేళ్ల పాటు ఉంటుంది. మానవ హక్కుల మండలిలో మొత్తం 18 మంది సభ్యులుంటారు. మూడేళ్లకోసారి ఇందులో సభ్యత్వం కోసం రహస్య ఓటింగ్‌ నిర్వహిస్తారు. కనీసం 97 మంది సభ్యుల మద్దతు ఉన్న వారినే సభ్యత్వం కోసం పరిగణనలోకి తీసుకుంటారు. ఆసియా-పసిఫిక్‌ ప్రాంతాల నుంచి ఐదు దేశాలకు ప్రాతినిధ్యం ఉండగా మనదేశంతో పాటు బహ్రెయిన్‌, బంగ్లాదేశ్‌, ఫిజి, ఫిలిప్పీన్స్ కూడా ఎంపికయ్యాయి.

More Telugu News