team india: వెస్టిండీస్ ఆలౌట్.. దూకుడుగా ఇన్నింగ్స్ ఆరంభించిన భారత ఓపెనర్లు

  • 311 పరుగులకు ఆలౌట్ అయిన విండీస్
  • 88 పరుగులు ఇచ్చి 6 వికెట్లు కూల్చిన ఉమేష్ యాదవ్
  • వన్డే స్టైల్లో ఇన్నింగ్స్ ఆరంభించిన టీమిండియా

ఉప్పల్ లో జరుగుతున్న రెండో టెస్టులో వెస్టిండీస్ ఆలౌట్ అయింది. ఏడు వికెట్లకు 295 పరుగులతో రెండో రోజు బ్యాటింగ్ ను ప్రారంభించిన విండీస్... స్కోరు బోర్డుకు మరో 16 పరుగులు మాత్రమే జత చేసింది. మొత్తం మీద 101.4 ఓవర్లలో 311 పరుగులకు ఆలౌట్ అయింది. మరోవైపు, భారత పేసర్ ఉమేష్ యాదవ్ తన కెరీల్ లో బెస్ట్ ఫిగర్స్ సాధించాడు. 88 పరుగులకు 6 వికెట్లు సాధించాడు. చివరి మూడు వికెట్లు కూడా ఉమేష్ ఖాతాలోకే చేరాయి.

మరోవైపు విండీస్ బ్యాట్స్ మెన్ ఛేజ్ సెంచరీ సాధించాడు. 106 పరుగులకు ఉమేష్ బౌలింగ్ లో బౌల్డ్ అయ్యాడు. విండీస్ బ్యాట్స్ మెన్లలో పావెల్ 22, హోప్ 36, డౌరిచ్ 30, హోల్డర్ 52 పరుగులు చేశారు. వారికన్ 8 పరుగులతో నాటౌట్ గా నిలిచాడు. ఇండియన్ బౌలర్లలో ఉమేష్ 6 వికెట్లు, కుల్దీప్ యాదవ్ 3, అశ్విన్ 1 వికెట్ పడగొట్టారు.

అనంతరం తొలి ఇన్నింగ్స్ ను టీమిండియా దూకుడుగా ప్రారంభించింది. తొలి టెస్టులో అరంగేట్రంలోనే అదరగొట్టి సెంచరీ చేసిన పృథ్వీ షా 13 బంతుల్లో 15 పరుగుల (2 ఫోర్లు, 1 సిక్స్)తో ఆడుతుండగా... ఒక బంతిని ఎదుర్కొన్న కేఎల్ రాహుల్ 3 పరుగులు చేశాడు. టీమిండియా స్కోరు 2 ఓవర్లలో 20 పరుగులు. 

More Telugu News