Vijayawada: అమ్మ దర్శనానికి వెళితే...వెంటపడి, వేధిస్తున్న హిజ్రాలు!

  • డబ్బులిస్తేగాని కదలనీయని పరిస్థితి
  • ఎంతోకొంత ఇచ్చి వదిలించుకుంటున్న భక్తులు
  • విజయవాడ ఇంద్రకీలాద్రి శరన్నవరాత్రి ఉత్సవాల్లో హల్‌చల్‌ చేస్తున్న హిజ్రాలు

విజయవాడ ఇంద్రకీలాద్రిపై జరుగుతున్న శరన్నవరాత్రి ఉత్సవాల్లో పాల్గొని దుర్గమ్మ దర్శనం చేసుకుందామని ఉత్సాహంగా వెళ్లే భక్తులకు దారి మధ్యలో ఎదురవుతున్న ఇబ్బందులు చికాకు తెప్పిస్తున్నాయి. ముఖ్యంగా హిజ్రాలు ఎక్కడికక్కడ కాపుకాసి డబ్బుల కోసం భక్తుల్ని డిమాండ్‌ చేయడం, డబ్బులిచ్చే వరకు విడిచిపెట్టక పోవడంతో బెంబేలెత్తిపోతున్నారు. వీరి నుంచి బయటపడడానికి మహిళలు, యువకులు తీవ్రయాతన పడాల్సి వస్తోంది.

అమ్మవారి దర్శనానికి వెళ్లడం, వస్తున్న భక్తుల వెంట పడడం, తలపై, భుజాలపై చేతులు వేయడం వంటి చేష్టలు చేయడంతో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రథం సెంటర్‌ వద్ద శుక్రవారం హిజ్రాలు హల్‌చల్‌ చేయడంతో భక్తుల్లో ఒక్కసారిగా అలజడి రేగింది. ఐదుగురు హిజ్రాలు డబ్బు కోసం డిమాండ్‌ చేయడం, డబ్బుల్లేవని పర్సు చూపించినా వినిపించుకోక పోవడంతో వారి నుంచి తప్పించుకునేందుకు ప్రయాస పడాల్సి వచ్చింది. కొందరిని కదలనీయకుండా కట్టడి చేయడంతో ఎంతోకొంత ఇచ్చి వదిలించుకోక తప్పని పరిస్థితి ఎదురయింది. వీరి చేష్టలపై పోలీసులు దృష్టిపెట్టాలని భక్తులు కోరుతున్నారు.

More Telugu News