Aravinda Sametha Movie: ‘అరవింద సమేత’కు వెళ్లిన ఆరుగురు విద్యార్థులు.. ప్రిన్సిపాల్ మందలించడంతో అదృశ్యం!

  • ఆలస్యమవడంతో మందలించిన ప్రిన్సిపాల్
  • కనిపించకుండా పోయిన విద్యార్థులు
  • స్కూల్ వద్ద తల్లిదండ్రుల ఆందోళన

స్కూల్ టైంలో ‘అరవింద సమేత’కు వెళ్లిన ఆరుగురు విద్యార్థుల అదృశ్యం తిరుపతిలో కలకలం రేపుతోంది. రైల్వే కాలనీలోని ఓ ప్రైవేట్ స్కూల్‌కు చెందిన ఆరుగురు పదో తరగతి విద్యార్థులు ‘అరవింద సమేత’ సినిమాకు వెళ్లి స్కూల్‌కి ఆలస్యంగా రావడంతో ప్రిన్సిపాల్ మందలించారు. దీంతో విద్యార్థుల ఆచూకీ తెలియకుండా పోయింది.

సీఐ చంద్రబాబు నాయుడు కథనం ప్రకారం.. పదో తరగతి విద్యార్థులైన వినయ్ కుమార్, పూజిత్ నాయక్, వంశీ, వినయ్, బాలాజీ, ప్రశాంత్ స్కూల్‌కు వెళ్లకుండా.. గురువారం విడుదలైన ‘అరవింద సమేత’ సినిమాను చూడ్డానికి వెళ్లారు. స్కూల్‌కి వచ్చేసరికి ఆలస్యమవడంతో ప్రిన్సిపాల్ మందలించి.. తల్లిదండ్రులను తీసుకురావాలని పంపించేశారు. దీంతో ఆ విద్యార్థులు కనిపించకుండా పోయారు. బిడ్డల ఆచూకీ తెలియక తల్లిదండ్రులు స్కూల్‌ వద్ద ఆందోళనకు దిగారు. దీనిపై ప్రిన్సిపాల్.. ఈస్ట్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేపట్టారు.

More Telugu News