lakshmi`s Ntr: ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ షూటింగ్ దసరా రోజున ప్రారంభిస్తా: రామ్ గోపాల్ వర్మ

  • మళ్లీ తెరపైకొచ్చిన లక్ష్మీస్ ఎన్టీఆర్
  • జనవరి నెలాఖరులో విడుదల చేస్తాం
  • ఈ నెల 19న తిరుపతిలో వివరాలు వెల్లడిస్తా

ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించనున్న ఎన్టీఆర్ బయోపిక్ ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’. ఈ బయోపిక్ తెరకెక్కిస్తానని వర్మ ప్రకటించి కూడా చాలారోజులే అయింది. తాజాగా, వర్మ స్పందిస్తూ ఓ ట్వీట్ చేశారు. ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ షూటింగ్ దసరా రోజున ప్రారంభిస్తానని, జనవరి నెలాఖరులో విడుదల చేస్తామని ప్రకటించారు.

ఈ బయోపిక్ కు సంబంధించిన వివరాలను ఈ నెల 19న తిరుపతిలో వెల్లడిస్తానని తెలిపారు. కాగా, ఎన్టీఆర్, లక్ష్మీపార్వతి దండలు మార్చుకుంటున్న నాటి ఫొటోను వర్మ పోస్ట్ చేశారు. ఈ ఫొటోలో నారా చంద్రబాబునాయుడు కూడా ఉండటం గమనించవచ్చు.

More Telugu News