Ayesha Meera: ఆయేషా మీరా హత్యకేసులో రికార్డులన్నీ ధ్వంసం.. హైకోర్ట్ ఆగ్రహం!

  • ఆయేషా హత్య కేసును దర్యాప్తు చేస్తున్న సిట్
  • కేసు నడుస్తున్న సమయంలోనే రికార్డుల ధ్వంసం
  • 4 వారాల్లో నివేదిక సమర్పించాలి

సంచలనం సృష్టించిన ఆయేషా మీరా హత్య కేసులో రికార్డులన్నీ ధ్వంసమైనట్టు సిట్ తెలిపింది. ఈ కేసును ప్రస్తుతం సిట్ దర్యాప్తు చేస్తోంది. దర్యాప్తునకు సంబంధించిన వివరాలను ఎప్పటికప్పుడు తమకు అందించాలని హైకోర్టు ఆదేశించింది. అయితే హైకోర్టులో కేసు నడుస్తున్న సమయంలోనే విజయవాడ కోర్టులో కేసు రికార్డులన్నీ ధ్వంసమయ్యాయని సిట్ హైకోర్టుకు తెలిపింది.

గతంలో మూడో నివేదిక సమర్పించిన అనంతరం ఆయేషా మీరా తరఫు న్యాయవాదులు స్థానిక కోర్టులో ఈ కేసుకు సంబంధించిన రికార్డులు ధ్వంసమయ్యాయని అనుమానం వ్యక్తం చేశారు. హైకోర్టులో విచారణ జరుగుతున్న సమయంలో ఇలా రికార్డులు ధ్వంసమయ్యాయని పేర్కొనడంపై హైకోర్టు ఆశ్చర్యంతోపాటు ఆగ్రహం వ్యక్తం చేసింది. రికార్డుల ధ్వంసంపై విచారణ జరిపి 4 వారాల్లో నివేదిక సమర్పించాలని రిజిస్ట్రార్‌ జనరల్‌ను ఆదేశించింది.

More Telugu News