ATM: గ్యాస్ కట్టర్లతో ఏటీఎంలను బద్దలు కొట్టి... రూ.35 లక్షల చోరీ

  • ఎర్నాకుళం, త్రిస్సూర్‌లలో వరుస చోరీలు
  • ఒకే ముఠా పనిగా భావిస్తున్న పోలీసులు
  • సీసీ కెమేరాలకు పెయింట్ స్ప్రే

ఏటీఎంను బద్దలుకొట్టి రూ.35 లక్షలు కొల్లగొట్టిన ఘటన కేరళలో సంచలనం రేపుతోంది. ఎర్నాకుళం, త్రిస్సూర్‌ జిల్లాలలో నేటి తెల్లవారుజామున వరుస చోరీలు జరిగాయి. తొలుత తెల్లవారుజామున 2:30 గంటల సమయంలో ఎర్నాకుళం జిల్లా త్రిప్పునిత్తురలో ఇరుంబనం వద్దనున్న ఓ జాతీయ బ్యాంకు ఏటీఎంను గ్యాస్ కట్టర్ల ద్వారా పగలగొట్టిన దొంగలు.. రూ.25 లక్షలతో పరారయ్యారు.

త్రిస్సూర్ జిల్లా కోరట్టిలోని ఓ ప్రయివేటు బ్యాంకు ఏటీఎంలో కూడా తెల్లవారుజామున 4:30 గంటల సమయంలో చోరీ జరిగింది. గుట్టు చప్పుడు కాకుండా ఏటీఎంను పగలగొట్టి రూ.10 లక్షలు దోచుకెళ్లారు. ఈ రెండు చోరీలు ఒకే ముఠా పనేనని పోలీసులు భావిస్తున్నారు. దోపిడికి పాల్పడే ముందే సీసీ కెమేరాలకు పెయింట్ స్ప్రే చేసినట్టు పోలీసులు తెలిపారు.

More Telugu News