mee to: ‘మీ టూ’ ఎఫెక్ట్.. దిగివచ్చిన కేంద్ర ప్రభుత్వం..న్యాయ నిపుణుల కమిటీ ఏర్పాటు!

  • కేంద్ర మంత్రి అక్బర్ సహా పలువురిపై ఆరోపణలు
  • అన్నివైపుల విమర్శల నేపథ్యంలో స్పందించిన ప్రభుత్వం
  • ప్రకటించిన స్త్రీ,శిశు సంక్షేమ మంత్రిత్వశాఖ

హాలీవుడ్ లో లైంగిక వేధింపులపై మొదలైన ‘మీ టూ’ ఉద్యమం భారత్ లో అన్ని రంగాలకు విస్తరిస్తోంది. బాలీవుడ్ నటులు నానా పటేకర్, అలోక్ నాథ్, గేయ రచయిత వైరముత్తు, నవలా రచయిత చేతన్ భగత్, టాటా మోటార్స్ ఉన్నతాధికారి సురేశ్ రంగరాజన్, దర్శకులు సాజిద్ ఖాన్, సుభాష్ ఘయ్, కేంద్ర మంత్రి ఎంజే అక్బర్  తమను లైంగికంగా వేధించారని ఆరోపిస్తూ పలువురు మహిళలు బయటికొచ్చారు.

ఈ నేపథ్యంలో అన్ని వైపుల నుంచి విమర్శలు పోటెత్తడంతో కేంద్రం స్పందించింది. ఈ ఆరోపణలపై విచారణ జరిపి చర్యలు తీసుకునేందుకు వీలుగా సీనియర్ న్యాయ నిపుణులతో ఓ కమిటీని నియమిస్తామని ప్రకటించింది. ఈ మేరకు కేంద్ర స్త్రీ,శిశు సంక్షేమ శాఖ ఈ రోజు ఓ ప్రకటనను విడుదల చేసింది.

More Telugu News