vishal: 'పందెం కోడి 2' రాక పక్కాగా ఖరారైపోయింది

  • లింగుస్వామి నుంచి 'పందెం కోడి 2'
  • విశాల్ సరసన కీర్తి సురేశ్ 
  • కీలకమైన పాత్రలో వరలక్ష్మి శరత్ కుమార్ 

విశాల్ మాస్ హీరోగా తమిళంలో నిలదొక్కుకోవడానికీ .. తెలుగు ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు తెచ్చుకోవడానికి 'పందెం కోడి' సినిమానే కారణం. లింగుస్వామి దర్శకత్వంలో వచ్చిన ఆ సినిమా భారీ విజయాన్ని సాధించింది. ఆ సినిమాకి సీక్వెల్ గా ఇప్పుడు 'పందెం కోడి 2' వస్తోంది. దసరా కానుకగా తెలుగు .. తమిళ భాషల్లో ఈ నెల 18వ తేదీన ఈ సినిమాను విడుదల చేస్తున్నారు.

'అరవింద సమేత' హిట్ టాక్ తెచ్చుకోవడం వలన, 'పందెం కోడి 2' విడుదల తేదీ మారే అవకాశం వున్నట్టుగా ప్రచారం మొదలైంది. దాంతో ఈ సినిమా టీమ్ స్పందించింది. ముందుగా అనుకున్నట్టే తాము ఈ నెల 18వ తేదీనే రానున్నట్టుగా 'పందెం కోడి 2' టీమ్ కొత్త పోస్టర్ ను రిలీజ్ చేశారు. 'పందెం కోడి 2' సినిమా కూడా తనకి హిట్ ఇస్తుందనే నమ్మకంతో విశాల్ వున్నాడు. కీర్తి సురేశ్ కథానాయికగా నటించిన ఈ సినిమాలో, వరలక్ష్మి శరత్ కుమార్ కీలకమైన పాత్రను పోషించింది.  

More Telugu News