meetoo: మీటూ ఉద్యమంపై బరాక్ ఒబామా భార్య మిషెల్ స్పందన

  • మహిళలంతా ధైర్యంగా ముందుకు రావాలి
  • రాబోయే తరాలకు మంచి బాటను వేయాలి
  • మార్పు అనేది అంత సులభంగా రాదు

ప్రపంచవ్యాప్తంగా మీటూ ఉద్యమం ఉవ్వెత్తున ఎగసిపడుతోంది. లైంగిక దాడులను ఎదుర్కొన్న మహిళలు తమ చేదు అనుభవాలను నిర్భయంగా బయటపెడుతున్నారు. ఈ క్రమంలో  అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా భార్య మిషెల్ కూడా మీటూ ఉద్యమానికి మద్దతు పలికారు. మహిళలంతా ధైర్యంగా ముందుకు రావాలని... తద్వారా రాబోయే తరాలకు మంచి బాటను వేయాలని సూచించారు.

మహిళలు, బాలికలకు విద్యను అందించేందుకు ఏర్పాటు చేసిన 'గ్లోబల్ గర్ల్ అలయెన్స్'ను మిషెల్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, మార్పుతో ఏదైనా సాధ్యమవుతుందని... అయితే, మార్పు అనేది అంత సులభంగా రాదని చెప్పారు. మన పోరాటానికి ఎన్నో అడ్డంకులు ఉంటాయని తెలిపారు. బాధిత మహిళలంతా తదుపరి తరాలకు మంచి బాటను వేస్తున్నామనే భావనతో పోరాటం చేయాలని సూచించారు. స్త్రీ, పురుషుల మధ్య సమానత్వం ఉండాలని మహిళలు కోరుకుంటున్నారని చెప్పారు. మహిళలు, బాలికల విషయంలో చేయాల్సింది ఇంకా చాలా ఉందని అన్నారు.

More Telugu News