ntr: 'అరవింద' తొలిరోజు వసూళ్లు 60 కోట్లు!

  • రాయలసీమ నేపథ్యంలో సాగే కథ 
  • కథాకథనాల్లో కొత్తదనం
  • ఆకట్టుకునే సంగీతం      

త్రివిక్రమ్ దర్శకత్వం వహించిన 'అరవింద సమేత వీర రాఘవ' చిత్రం నిన్ననే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. రాయలసీమ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాకి, మాస్ ఆడియన్స్ నుంచి మంచి మార్కులు పడుతున్నాయి. తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్ లోను ఈ సినిమా వసూళ్ల పరంగా దుమ్మురేపేస్తోంది. ఆంధ్ర - తెలంగాణ రాష్ట్రాల్లో తొలిరోజు వసూళ్ల విషయంలో ఈ సినిమా నాన్ 'బాహుబలి' రికార్డును అధిగమించిందని చెబుతున్నారు.

తొలి రోజున ఒక్క నైజామ్ లోనే ఈ సినిమా 5.73 కోట్లను సాధించింది. తెలుగు రాష్ట్రాల్లో తొలిరోజున 26.64 కోట్ల షేర్ ను వసూలు చేసింది. ఇక ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే 60 కోట్ల గ్రాస్ ను రాబట్టింది. ఎన్టీఆర్ కెరియర్లో తొలి రోజు వసూళ్ల విషయంలో తొలి స్థానంలో ఈ సినిమా నిలవడం విశేషం. కథాకథనాల్లోని కొత్తదనం .. సంగీతం .. ఎన్టీఆర్ యాక్షన్ .. పూజా గ్లామర్ ఈ సినిమాకి ఈ స్థాయి వసూళ్లు తెచ్చిపెట్టాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.  

More Telugu News