it raids: ఐటీ దాడుల ఎఫెక్ట్.. సీఎం రమేశ్ ఇంటివద్దకు భారీగా చేరుకుని ఆందోళన చేస్తున్న గ్రామస్తులు!

  • కడప జిల్లా పోట్లదుర్తిలో ఘటన
  • కేంద్రం, ఐటీ దాడులకు వ్యతిరేకంగా నినాదాలు
  • భారీగా హాజరైన మహిళలు

తెలుగుదేశం నేత, పార్లమెంటు సభ్యుడు సీఎం రమేశ్, ఆయన బంధువుల ఇళ్లు, కార్యాలయాలపై ఐటీ అధికారులు ఈ రోజు దాడులు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ప్రత్యేక హోదా, కడప స్టీల్ ఫ్యాక్టరీపై ఉద్యమించినందుకే తనను, టీడీపీ నేతలను కేంద్రం టార్గెట్ చేసుకుంటోందని సీఎం రమేశ్ ఆరోపించారు. ఎన్ని దాడులు నిర్వహించినా, ఎంతగా హింసించినా రాష్ట్ర ప్రయోజనాల విషయంలో వెనక్కు తగ్గబోమని స్పష్టం చేశారు. ప్రస్తుతం సీఎం రమేశ్ ఢిల్లీలో ఉన్నవేళ హైదరాబాద్ తో పాటు కడప జిల్లాలోని ఆయన స్వగ్రామం పోట్లదుర్తిలో ఐటీ దాడులు కొనసాగుతున్నాయి.

ఈ నేపథ్యంలో సీఎం రమేశ్ కు మద్దతుగా, కేంద్ర ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ పోట్లదుర్తి ప్రజలు భారీ ర్యాలీ నిర్వహించారు. కేంద్రం నిరంకుశ వైఖరి నశించాలి, కేంద్ర ప్రభుత్వం డౌన్ డౌన్, మోదీ-కేడీ అంటూ నినాదాలు చేశారు. సీఎం రమేశ్ ఇంటి వద్దకు చేరుకుని ఐటీ దాడులకు వ్యతిరేకంగా ఆందోళన నిర్వహించారు. అనంతరం అక్కడే బైఠాయించి నిరసన తెలిపారు.

More Telugu News