ntr: యూఎస్ లో దూసుకుపోతోన్న 'అరవింద'!

  • తెలుగు రాష్ట్రాల్లో 'అరవింద' సందడి 
  • ఓవర్సీస్ లోను అదే జోరు 
  • ఎన్టీఆర్ ఫ్యాన్స్ లో ఆనందం  

త్రివిక్రమ్ .. ఎన్టీఆర్ కాంబినేషన్లో రూపొందిన 'అరవింద సమేత వీర రాఘవ' చిత్రం నిన్ననే ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తొలి రోజునే ఈ సినిమా విడుదలైన అన్ని ప్రాంతాల నుంచి మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్ లోను ఈ సినిమా వసూళ్ల పరంగా దూసుకుపోతోంది. యూఎస్ లో తొలిరోజు ముగిసేసరికి ఈ సినిమా 1 మిలియన్ డాలర్లను సొంతం చేసుకుంది.

ఎన్టీఆర్ ఇలా యూఎస్ లో 1 మిలియన్ డాలర్లు రాబట్టుకోవడం ఇది 6వ సారి. గతంలో ఆయన చేసిన 'దమ్ము' ..  'టెంపర్' .. 'నాన్నకు ప్రేమతో' .. 'జనతా గ్యారేజ్'.. 'జై లవకుశ' చిత్రాలు 1 మిలియన్ డాలర్ క్లబ్ లో వున్నాయి. తాజాగా ఈ క్లబ్ లోకి  'అరవింద సమేత వీర రాఘవ' కూడా చేరిపోయింది. త్రివిక్రమ్ .. ఎన్టీఆర్ కాంబినేషన్లో రూపొందిన తొలి చిత్రం కావడంతో, ఈ సినిమా తప్పకుండా హిట్ కొడుతుందని అభిమానులు భావించారు. యూఎస్ లో ఈ సినిమా 1 మిలియన్ డాలర్ మార్కును క్రాస్ చేసి 2 మిలియన్ డాలర్ మార్క్ దిశగా పరుగులు తీస్తుండటం చూసి వాళ్లంతా ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. 

More Telugu News