Pakistan: ఆర్థిక సంక్షోభంలో పాక్.. అప్పు కోసం ఐఎంఎఫ్‌ను ఆశ్రయించనున్న ఇమ్రాన్ ప్రభుత్వం!

  • విదేశీ మారక ద్రవ్య సంక్షోభంలో పాక్
  • తమను ఆదుకోవాలంటూ ఐఎంఎఫ్‌ వద్దకు
  • తీవ్రమైన షరతులు విధించే అవకాశం 

పాకిస్థాన్ తీవ్ర ఆర్థిక సంక్షోభంలో చిక్కుకుంది. చేతిలో పైసా కూడా లేక విలవిల్లాడుతోంది. కష్టాల నుంచి బయటపడే మార్గాన్ని అన్వేషిస్తోంది. అందులో భాగంగా అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ (ఐఎంఎఫ్) నుంచి దాదాపు రూ.59 వేల కోట్లు (8 బిలియన్ డాలర్ల) రుణం కోసం ప్రయత్నాలు ప్రారంభించింది. ప్యాకేజీ రూపంలో పాక్ కోరుతున్న ఈ రుణాన్ని మంజూరు చేసేందుకు ఐఎంఎఫ్ పలు షరతుల్ని విధించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. వీటిని పూర్తి చేసేందుకే పాకిస్థాన్‌కు మరింత రుణం అవసరం అవుతుందని సమాచారం. దీనిని కూడా కలుపుకుంటే మొత్తం రూ.88,500 కోట్ల (12 బిలియన్ డాలర్లు) రుణాన్ని తీసుకోవాల్సి వస్తుందని పాక్ పత్రికలు పేర్కొన్నాయి. తాము విదేశీ మారక ద్రవ్య సంక్షోభంలో చిక్కుకుని విలవిల్లాడుతున్నామని, తమకు సాయం చేసి బయటపడేయాల్సిందిగా అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థను కోరనున్నట్టు పాకిస్థాన్ ఆర్థిక మంత్రి అసద్ ఉమర్ తెలిపారు.

More Telugu News