Train Accident: ప్లాట్‌ఫాంకు, రైలుకు మధ్య ఇరుక్కున్న యువకుడు.. మృతి!

  • పట్టాలు దాటుతుండగా దూసుకువచ్చిన ఎంఎంటీఎస్ రైలు
  • తీవ్రంగా శమ్రించి బయటకు తీసిన జీఆర్‌పీ, ఆర్పీఎఫ్‌ సిబ్బంది
  • చికిత్స పొందుతూ చనిపోయిన బాధితుడు

రైలు బయలుదేరిపోతుందేమోనన్న ఆందోళన... పాదచారుల వంతెనపై నుంచి వెళితే సమయం పడుతుందన్న ఆదుర్దాతో, వేగంగా దూసుకువస్తున్న రైలును గమనించకపోవడం వల్ల ఓ యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. పట్టాలు దాటుతుండగా ఎంఎంటీఎస్ రైలు దూసుకురావడంతో ప్లాట్‌ఫాం, రైలు మధ్య ఇరుక్కుని ప్రాణాలు కోల్పోయాడు.

వివరాల్లోకి వెళితే... మహారాష్ట్ర లాతూర్‌ జిల్లా అహ్మద్‌పూర్‌ - నందూపూర్‌ రోడ్డు కటీఫ్‌ ప్రాంతానికి చెందిన ఖురేషీ అహ్మద్‌ మటన్‌ వ్యాపారి. చంద్రాయణగుట్టలోని బంధువు ఇంటిలో జరిగే వివాహ వేడుకకు హాజరయ్యేందుకు బుధవారం రాత్రి లింగంపల్లి స్టేషన్‌కు చేరుకున్నాడు. ఫలక్‌నుమా వెళ్లేందుకు ఎంఎంటీసీ టికెట్‌ తీసుకున్నాడు. రైలు దూసుకు వస్తున్న విషయాన్ని గమనించకుండా నాల్గో నంబరు ప్లాట్‌ఫాం దాటే ప్రయత్నం చేశాడు. ఈలోగా రైలు దూసుకురావడంతో ప్లాట్‌ఫాం, రైలు మధ్య ఇరుక్కుపోయాడు.

 అహ్మద్‌ను గమనించిన ఎంఎంటీఎస్ రైలు డ్రైవర్‌ బ్రక్‌ వేసినా ఫలితం లేకపోయింది. అప్పటికే రైలు దూసుకురావడంతో ప్లాట్‌ఫాం మధ్య ఇరుక్కుపోయాడు. రైలును జాకీతో పైకిలేపి, ప్లాట్‌ఫాం కొంత పగులగొట్టి అహ్మద్‌ను బయటకు తీసి 108లో ఉస్మానియా ఆప్పత్రికి తరలించారు. కాళ్లు, నడుంకు తీవ్రగాయాలు కావడంతో చికిత్స పొందుతూ మృతిచెందాడు.

More Telugu News