jujior ntr: నాకు గౌరవం ఇచ్చిన సినిమా ఇది: దర్శకుడు త్రివిక్రమ్

  • ఈరోజు విడుదలైన ‘అరవింద సమేత వీరరాఘవ’
  • పరిచయం లేనివాళ్లూ ఫోన్ చేసి అభినందిస్తున్నారు
  • ఈ కథను మా కంటే ఎన్టీఆరే ఎక్కువగా నమ్మారు

త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్ హీరోగా రూపొందించిన ‘అరవింద సమేత వీరరాఘవ’ చిత్రం ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్రంపై మంచి టాక్ వచ్చిన నేపథ్యంలో హైదరాబాద్ లో సక్సెస్ మీట్ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా త్రివిక్రమ్ శ్రీనివాస్ మాట్లాడుతూ, ఈ చిత్రానికి చాలా మంచి రెస్పాన్స్ వస్తోందని, పరిచయం లేనివాళ్లు కూడా తనకు ఫోన్ చేసి అభినందిస్తున్నారని, తనకు గౌరవం ఇచ్చిన సినిమా ఇదని చెప్పారు.

ఈ చిత్ర కథను తమ కంటే ఎన్టీఆర్ ఎక్కువగా నమ్మారని చెప్పారు. ఈ చిత్రంలో ఎంటర్ టైన్ మెంట్, ఎన్టీఆర్ కు స్టెప్పులు తగ్గుతున్నాయేమోనని తాము ఆలోచించే వాళ్లమని, ఎన్టీఆర్ మాత్రం తనకు ఏ కథ అయితే చెప్పానో దాన్ని అలాగే తీయమని చెప్పి తమను ముందుకు నడిపించారని చెప్పుకొచ్చారు. కనుక, ‘ఫస్ట్ థ్యాంక్స్‘ ఎన్టీఆర్ కే చెప్పాలని అన్నారు.   

More Telugu News