America: రష్యా రాకెట్ ఎమర్జెన్సీ ల్యాండింగ్.. పెను ప్రమాదం నుంచి బయటపడ్డ వ్యోమగాములు

  • సోయూజ్‌ రాకెట్‌లో సాంకేతిక సమస్య
  • ఐఎస్‌ఎస్‌కు బయలుదేరిన వ్యోమగాములు
  • బయలుదేరిన సహాయక బృందం

అమెరికాకు చెందిన వ్యోమగామి నిక్‌ హాగ్‌, రష్యాకు చెందిన అలెక్సీ ఓవ్‌చినిన్‌‌లు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి (ఐఎస్‌ఎస్‌) బయలుదేరారు. అయితే ఈ వ్యోగాములను తీసుకెళ్తున్న సోయూజ్‌ రాకెట్‌లో సాంకేతిక సమస్య తలెత్తింది. దీంతో అత్యవసరంగా తిరిగి రాకెట్‌ను దించేసినట్టు రష్యా అంతరిక్ష కేంద్రం వెల్లడించింది. దీంతో వ్యోమగాములిద్దరూ పెను ప్రమాదం నుంచి బయటపడ్డారు. అలెక్సీ రెండోసారి ఐఎస్ఎస్‌కు వెళుతుండగా.. నిక్ వెళ్లడం మాత్రం మొదటిసారే.

రష్యా అంతరిక్ష సంస్థ ట్విటర్‌‌ ద్వారా.. రాకెట్‌లోని అత్యవసర రక్షణ వ్యవస్థ పని చేసిందని, వ్యోమగాములు ఉన్న క్యాప్సూల్ కజకిస్థాన్‌లో ల్యాండ్‌ అయ్యిందని, వ్యోమగాములిద్దరూ సురక్షితంగా ఉన్నారని వెల్లడించింది. రాకెట్‌ ఇంజిన్‌లో సమస్య తలెత్తినట్లు సంబంధిత అధికారులు చెబుతున్నారు. ఆ వ్యోమగాములు ల్యాండ్ అయిన ప్రదేశానికి సహాయక బృందం బయలుదేరిందని అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ తెలిపింది.

More Telugu News