sensex: భారీ నష్టాలను మూటగట్టుకున్న స్టాక్ మార్కెట్లు

  • ఒకానొక సమయంలో 1000 పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్
  • చివరకు 759 పాయింట్ల నష్టంతో ముగింపు
  • 225 పాయింట్లు కోల్పోయిన నిఫ్టీ

దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు భారీ నష్టాలను మూటగట్టుకున్నాయి. ఉదయం నష్టాలతో ప్రారంభమైన మార్కెట్లు ట్రేడింగ్ ముగిసేంత వరకు నష్టాల్లోనే కొనసాగాయి. ఒకానొక సమయంలో సెన్సెక్స్ 1000 పాయింట్లకు పైగా కోల్పోయింది. ఆ తర్వాత కొంత పుంజుకుని చివరకు 759 పాయింట్ల నష్టంతో 34,001 వద్ద ముగిసింది. నిఫ్టీ 225 పాయింట్లు కోల్పోయి 10,234కు పడిపోయింది.

బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
ఎంఎంటీసీ లిమిటెడ్ (18.43), హిందుస్థాన్ పెట్రోలియం (14.70), మంగళూరు రిఫైనరీ అండ్ పెట్రో కెమికల్స్ (10.58), హెచ్ఈజీ లిమిటెడ్ (9.37), హిందుస్థాన్ కాపర్(8.08).

టాప్ లూజర్స్:
ఎన్ఐఐటీ టెక్నాలజీస్ (11.54), ఐఐఎఫ్ఎల్ హోల్డింగ్స్ (10.89), ఇన్ఫీబీమ్ అవెన్యూస్ (10.78), ఇండియాబుల్స్ హౌసింగ్ ఫైనాన్స్ (8.70), జేఎం ఫైనాన్షియల్ లిమిటెడ్ (8.55).  

More Telugu News