ram: 'హలో గురు ప్రేమకోసమే' ప్రీ రిలీజ్ ఈవెంట్ ఆ రోజునే

  • రామ్ హీరోగా 'హలో గురు .. '
  • ఈ నెల 13న ప్రీ రిలీజ్ ఈవెంట్ 
  • 18వ తేదీన సినిమా విడుదల       

రామ్ .. అనుపమ పరమేశ్వరన్ జంటగా నక్కిన త్రినాథరావు దర్శకత్వంలో 'హలో గురు ప్రేమకోసమే' సినిమా రూపొందింది. రొమాంటిక్ లవ్ స్టోరీగా నిర్మితమైన ఈ సినిమాను, దసరా పండుగ సందర్భంగా ఈ నెల 18వ తేదీన భారీస్థాయిలో విడుదల చేయనున్నారు. ఈలోగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను జరపడానికి సన్నాహాలు చేస్తున్నారు.

ఈ నెల 13వ తేదీ (శనివారం) సాయంత్రం 6 గంటలకు, హైదరాబాద్ - ఫిల్మ్ నగర్లోని జెఆర్సీ కన్వెన్షన్ లో ఈ వేడుకను నిర్వహించనున్నారు. రీసెంట్ గా వదిలిన ట్రైలర్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. యూత్ కి కనెక్ట్ అయ్యే అంశాలు కావాల్సినన్ని వున్నాయనే టాక్ వచ్చింది. దసరా సెలవులు కావడంతో ఈ సినిమా థియేటర్ల దగ్గర గట్టిగానే సందడి చేసే ఛాన్స్ ఉందని చెప్పుకుంటున్నారు. ఈ ఏడాది రెండు సినిమాలతో నష్టాలపాలైన దిల్ రాజు, ఈ సినిమాతో లాభాలు రాబడతాడేమో చూడాలి. 

More Telugu News