taapsee: హారర్ థ్రిల్లర్ దర్శకుడితో తాప్సీ 'గేమ్ ఓవర్'

  • నయన్ 'మయూరి'తో మంచి పేరు 
  • తాప్సీ ప్రధాన పాత్రగా మరో మూవీ 
  • ఈ రోజునే పూజా కార్యక్రమాలు    

హిందీ భాషా చిత్రాలకి ఎక్కువగా ప్రాధాన్యతనిస్తూ, అవకాశం వచ్చినప్పుడు తెలుగు .. తమిళ భాషల్లో తాప్సీ నటిస్తోంది. తాజాగా ఆమె ఓ ద్విభాషా చిత్రం చేయడానికి అంగీకరించింది. తెలుగు .. తమిళ భాషల్లో ఈ సినిమా రూపొందుతోంది. 'వై నాట్ స్టూడియోస్' వారు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమాకి అశ్విన్ శరవణన్ దర్శకుడిగా వ్యవహరించనున్నాడు.

గతంలో నయనతార ప్రధాన పాత్రగా ఆయన తెరకెక్కించిన 'మయూరి' భారీ విజయాన్ని సాధించింది. దర్శకుడిగా ఆయనకి ఆ సినిమా మంచి పేరు తెచ్చిపెట్టింది. అందువలన ఈ ప్రాజెక్టుపై అంచనాలు పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ సినిమా ఈ రోజునే చెన్నైలో పూజా కార్యక్రమాలు జరుపుకుంది. ఆంధ్ర .. తెలంగాణ .. తమిళనాడు ప్రాంతాల్లో ఈ సినిమా షూటింగు జరుపుకోనుందని నిర్మాత శశికాంత్ అన్నారు. విభిన్నమైన కథాకథనాలతో నిర్మితమవుతోన్న ఈ సినిమా తమకి తప్పకుండా సక్సెస్ ను ఇస్తుందనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.     

More Telugu News