vijay devarakonda: 'నోటా' నిర్మాతకి భారీ నష్టాలు?

  • 'నోటా' నిర్మాతగా జ్ఞానవేల్ రాజా 
  • తెలుగులో సొంతంగా విడుదల
  • తొలిరోజు తరువాత పడిపోయిన వసూళ్లు     

విజయ్ దేవరకొండ కథానాయకుడిగా జ్ఞానవేల్ రాజా నిర్మాతగా 'నోటా' తెరకెక్కింది. ఆనంద్ శంకర్ దర్శకత్వం వహించిన ఈ సినిమా, తెలుగు .. తమిళ భాషల్లో ఈ నెల 5వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. విజయ్ దేవరకొండకి గల క్రేజ్ కారణంగా ఓపెనింగ్స్ బాగున్నప్పటికీ, ఆ తరువాత నెగెటివ్ టాక్ కారణంగా వసూళ్లు ఒక్కసారిగా తగ్గిపోయాయి. దాంతో అసలు ఈ సినిమాకి ఎంత ఖర్చు అయిందనేది ఆసక్తికరంగా మారింది.

తెలుగు .. తమిళ భాషల్లో ఈ సినిమాను 12 కోట్ల బడ్జెట్ తో నిర్మించారు. పబ్లిసిటీతో పాటు ఇతర ఖర్చులకి మరో 4 కోట్లు ఖర్చు అయిందట. తెలుగులో విజయ్ దేవరకొండకి గల క్రేజ్ కారణంగా 12 కోట్లు ఇస్తామంటూ ఏపీ నుంచి .. 4 కోట్లు ఇస్తామంటూ నైజామ్ నుంచి .. 2 కోట్లు ఇస్తామంటూ సీడెడ్ డిస్ట్రిబ్యూటర్ల నుంచి భారీ ఆఫర్లు వచ్చాయట. కానీ అంతకి మించిన రేట్లు చెప్పిన జ్ఞానవేల్ రాజా .. చివరికి తానే సొంతంగా రిలీజ్ చేసుకున్నాడు. ఫలితంగా ఆయనకి భారీ నష్టాలు వచ్చినట్టుగా సమాచారం. 

More Telugu News