Tapsi: సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం

  • తాప్సీ కొత్త చిత్రం 'గేమ్ ఓవర్'
  • వారం ముందుగానే 'సైరా' షెడ్యూలు పూర్తి 
  • మిత్రుడితో కలసి కొరటాల సినిమాలు    

*  గత కొన్నాళ్లుగా హిందీ సినిమాలు చేస్తున్న కథానాయిక తాప్సీ తెలుగు, తమిళ భాషల్లో తాజాగా ఓ చిత్రాన్ని చేస్తోంది. అశ్విన్ శరవణ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి 'గేమ్ ఓవర్' అనే టైటిల్ని నిర్ణయించారు. ఈ రోజు నుంచి ఈ చిత్రం షూటింగ్ జరుగుతుంది.
*  చిరంజీవి హీరోగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రూపొందుతున్న 'సైరా' చిత్రం షూటింగ్ గత కొన్నాళ్లుగా జార్జియాలో జరుగుతున్న సంగతి తెలిసిందే. 500 మంది యూనిట్ సభ్యులతో జరుగుతున్న ఈ షూటింగ్ వాస్తవ షెడ్యూల్ కి ఓ వారం ముందుగానే పూర్తవుతుందని తెలుస్తోంది. భారీ ఖర్చుతో యాక్షన్ దృశ్యాలను అక్కడ చిత్రీకరిస్తున్నారు.
*  దర్శకుడు కొరటాల శివ తన మిత్రుడు మిక్కిలినేని సుధాకర్ ని నిర్మాతగా మారుస్తున్నారు. తాను చేసే చాలా చిత్రాలకు మిత్రుడు సుధాకర్ నిర్మాతగా వ్యవహరిస్తాడని కొరటాల శివ పేర్కొన్నారు.

More Telugu News