srikantha chary: నాకు టికెట్ ఇవ్వకపోతే మంత్రి జగదీశ్ రెడ్డి ఇంటిముందు ఆత్మాహుతి చేసుకుంటా: శ్రీకాంతాచారి తల్లి శంకరమ్మ

  • సూర్యాపేటలో పార్టీ కోసం ఎంతో కష్టపడ్డాను
  • సూర్యాపేట టికెట్ నాకివ్వాలి
  • జగదీశ్ రెడ్డి హుజూర్ నగర్ నుంచి పోటీ చేయాలి

కేసీఆర్, కేటీఆర్ మద్దతు ఉన్నప్పటికీ  తనకు టికెట్ రాకుండా మంత్రి జగదీశ్ రెడ్డి అడ్డుపడుతున్నారని అమరవీరుడు శ్రీకాంతాచారి తల్లి శంకరమ్మ ఆరోపించారు. తెలంగాణ భవన్ లో కేటీఆర్ ను కలిసేందుకు ఆమె ప్రయత్నించారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ, సూర్యాపేట నియోజకవర్గంలో పార్టీ కోసం తాను ఎంతో కష్టపడ్డానని, ఇప్పుడు తెరపైకి సైదిరెడ్డిని తీసుకొస్తున్నారని అన్నారు.

తనకు కనుక టికెట్ ఇవ్వకపోతే తెలంగాణ రాష్ట్రం కోసం నాడు తన కుమారుడు ఏం చేశాడో, అదే పని తాను కూడా చేస్తానని, మంత్రి జగదీశ్ రెడ్డి ఇంటి ఎదుటే కిరోసిన్ పోసుకుని ఆత్మాహుతి చేసుకుంటానని కంటతడిపెట్టారు. సూర్యాపేట టికెట్ తనకు ఇచ్చి, ఎంతో బలం ఉందని చెప్పుకుంటున్న జగదీశ్ రెడ్డి హుజూర్ నగర్ నుంచి టీపీసీపీ అధ్యక్షుడు ఉత్తమ్ పై పోటీ చేయాలని అన్నారు. లేదా జగదీశ్ రెడ్డి ఎమ్మెల్సీ తీసుకుని మంత్రి కావొచ్చు కదా? అని సూచించారు. తనకు ఎమ్మెల్సీ పదవి వద్దని, ప్రజల మద్దతుతో ఎమ్మెల్యేగా గెలుస్తానని అన్నారు.

More Telugu News